టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల రేంజ్‌కి ఎదిగిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు సినిమాల విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడటమే కాదు... తమ చరిష్మా ఉపయోగించి బుడ్డ హీరోలకు చేయూతనివ్వడంలోనూ పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం.
తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు సాధారణంగా ఇతర హీరోలతో, సినిమా ఫంక్షన్లకు అంటీ ముట్టనట్లుగా ఉంటారు. అప్పుడప్పుడు అరుదుగా తప్ప ఎక్కడా కనిపించరు. అలాంటి వీరు ఈ మధ్య ఒకరితో ఒకరు పోటీ పడుతూ బుడ్డ హీరోల సినిమా వేడుకలకు హాజరవుతూ అందరినీ ఆశ్చర్చ పరుస్తున్నారు.
ఇటీవల జరిగిన ‘ఎస్ఎంఎస్’ సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు స్వయంగా హాజరవ్వడంతో పాటు, లవ్ ఫెయిల్యూస్ సిరిమాను ట్విట్టర్లో పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ కళ్యాణ్ ‘ఇష్క్’ మూవీ వేడుకకు హాజరవ్వడంతో ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగి, సినిమా కూడా వినోదాత్మకంగా ఉండటంతో మంచి విజయం సాధించింది. తాజాగా ఈ రోజు జరుగనున్న సాయికుమార్ తనయుడు ఆది నటించిన ‘లవ్లీ’ సినిమా ఆడియో వేడుకకు కూడా మహేష్ బాబు హాజరవుతున్నాడు.
No comments:
Post a Comment