Tuesday, 21 February 2012

కరిష్మాకు కలల పాత్ర ఇది !


కరిష్మా కపూర్ సినిమాల్లో నటించడం లేదే అంటూ బాధపడే ఆమె అభిమానులకు ఇది తీపి కబురు. విక్రమ్‌భట్ తీస్తున్న డేంజరస్ ఇష్క్‌లో నటిస్తున్నానని ఈ నిన్నటితరం తార ప్రకటించింది. ఈ సినిమాతో కరిష్మాకు తన కలల పాత్ర దక్కినట్టయిందని భట్ అన్నాడు. షూటింగ్ కూడా పూర్తయిందని, కేన్స్ చిత్రోత్సవంలోనూ డేంజరస్ ఇష్క్‌ను ప్రదర్శిస్తామని ప్రకటించాడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కొన్ని నెలల్లో దీనిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ‘అత్యుత్తమ ఆలోచనలే డేంజరస్ ఇష్క్ బలం. కరిష్మా చేసిన పాత్రను ప్రతి ఒక్క నటీ కోరుకుంటుంది.

కరిష్మాకు దీని స్క్రిప్టును వివరించినప్పుడే దాని సత్తా ఏంటో ఆమెకు అర్థమయింది. ఇందులో చేయడానికి కరిష్మా అంగీకరించగానే స్క్రిప్టును మరికాస్త మార్చాం’ అని ఈ దర్శకుడు వివరించాడు. కరిష్మా మళ్లీ సినిమాల్లోకి రావ డానికి ఈ సినిమా కాదని, ఒక మంచి నటిని దృష్టిలో ఉంచుకొనే చాలా కాలం క్రితం ఈ కథను రాశామన్నాడు. చాలా కాలం తరువాత మళ్లీ తెరపైకి వస్తున్న ఈమెకు డేంజరస్ ఇష్క్ పాత్ర చక్కగా సరిపోతుందని భట్ చెప్పాడు. మనోడి ఖాతాలో ఇది వరకే గులామ్, రాజ్ సినిమాలు ఉన్నాయి. గతంలో ఇతని గురువులు ముకేశ్ భట్, మహేశ్ భట్‌తో విభేదాల వల్ల అంతా విడిపోయారు.

అయితే ఇప్పుడు వీళ్లంతా రాజ్3 కోసం మళ్లీ ఒకక్కటయ్యారు. ‘మహేశ్, ముఖేశ్‌తో కలిసి పనిచేయడమంటే మళ్లీ మా ఇంటికి వచ్చినట్టే! మా మనసుల్లో ఏమున్నా అందరి సినిమాలూ బాగుండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం’ అని విక్రమ్‌భట్ వివరించాడు. డేంజరస్ ఇష్క్‌లో జిమ్మీ షేర్గిల్, రజనీశ్ దుగ్గల్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. దివ్యాదత్తా, రుస్లాన్ ముంతాజ్‌లు ఇతర పాత్రలు పోషిస్తారు. ఇది మే 11న విడుదలవుతుంది.

2 comments:

ALL SITE LABLES